: జెండాను తల్లకిందులుగా ఎగరేసిన మునిసిపల్ కమిషనర్


రిపబ్లిక్ దినోత్సవ శుభవేళ, జెండాను తల్లకిందులుగా ఎగరేశాడో మునిసిపల్ కమిషనర్. మెదక్ జిల్లా దుబ్బాకలోని గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యే రామలింగారెడ్డి సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. జెండాను ఎగురవేయగానే పైన కాషాయపు రంగు స్థానంలో ఆకుపచ్చ రంగు కనిపించడంతో రామలింగారెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఇదిలావుండగా, ప్రకాశం జిల్లా మార్కాపురం, జవహర్ నగర్ ఆరోగ్య కేంద్రంలో జరిపిన గణతంత్ర వేడుకల్లో అపశ్రుతి దొర్లింది. పతాకాన్ని ఆవిష్కరిస్తుండగా, విద్యుత్ తీగలు తగిలి వాచ్ మెన్ వెంకటేశ్వర్లు మృతి చెందాడు.

  • Loading...

More Telugu News