: 'జలాంతర్గామి' పేరు చెబితే నన్నో పిచ్చోడిలా ట్రీట్ చేశారు: హీరో రానా


తాను ఓ జలాంతర్గామికి చెందిన కథతో రూపొందిస్తున్న 'ఘాజీ' చిత్రంలో నటిస్తున్నానని చెబితే, ఎంతో మంది తనను పిచ్చివాడిగా చూశారని హీరో రానా వ్యాఖ్యానించారు. వచ్చే నెల 27న సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఓ ప్రమోషన్ కార్యక్రమంలో రానా మాట్లాడాడు. తన 32 ఏళ్ల వయసులో 20 ఏళ్ల పాటు విశాఖ ఆర్కే బీచ్ తో పరిచయం ఉందని, అక్కడ ఉన్న ఘాజీ సబ్ మెరైన్ ను నిత్యమూ చూశానని, దాని వెనుక ఇంత గొప్ప కథ ఉందని మాత్రం తనకు తెలియదని చెప్పుకొచ్చాడు. సినిమా టీజర్ చూసిన అమితాబ్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒప్పుకున్నారని, తన ఐడియాను నమ్మి సినిమా చేసేందుకు నిర్మాతలు ముందుకు వచ్చారని తెలిపాడు. భారత సినిమా చరిత్రలో ఇంతవరకూ ఎవరూ తాకని కథతో ఈ చిత్రాన్ని నిర్మించినట్టు వెల్లడించాడు.

  • Loading...

More Telugu News