: ప్రత్యేక హోదా, జల్లికట్టు, జనసేన... అవకాశవాద రాజకీయాలు: పొద్దున్నే ట్వీటేసిన పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ, ప్రత్యేక హోదాకు మద్దతు తెలుపుతూ మరో పాటను విడుదల చేసినట్టు తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 'ఏపీ డిమాండ్స్ స్పెషల్ స్టేటస్', 'జల్లికట్టు', 'జనసేన', 'బ్యాటిల్ ఆఫ్ ఆంధ్రా' ట్యాగ్ లైన్లు పెడుతూ, అవకాశవాద రాజకీయాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే తన లింకును ఫాలో కావాలని సూచించారు. ఆపై 'ట్రావెలింగ్ సోల్జర్' పాటను భాంగ్రా లడ్డూ మిక్స్ లో ఎర్రంశెట్టి రామకృష్ణ దర్శకత్వం వహించిన పాట లింకును ఉంచారు.
#APDemandsSpecialStatus #jallikattu #JanaSena #BattleofAndhras follow this link for opportunistic politics-https://t.co/WoxCB9wRo5
— Pawan Kalyan (@PawanKalyan) January 26, 2017