: విజయవాడలో అట్టహాసంగా గణతంత్ర వేడుకలు.. హాజరైన చంద్రబాబు, గవర్నర్ నరసింహన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలోని మునిసిపల్ స్టేడియంలో గణతంత్ర వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, గవర్నర్ నరసింహన్, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. వేడుకల సందర్భంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. గణతంత్ర వేడుకలను చూసేందుకు విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు.