: మంత్రి మాణిక్యాలరావుకు సారీ చెప్పిన చంద్రబాబు!
దేవాదాయ శాఖామంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సారీ చెప్పారు. ఇటీవల మాణిక్యాలరావు తల్లి మృతి చెందారు. ఆమె మృతిపట్ల సానుభూతి వ్యక్తం చేసిన చంద్రబాబు మంత్రివర్గ సమావేశానికి హాజరైన మంత్రితో మాట్లాడారు. మరోమారు సానుభూతి తెలిపారు. ఆమె చనిపోయిన సమయంలో నేరుగా పరామర్శించలేకపోయానంటూ సారీ చెప్పారు. బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోయానని పేర్కొన్నారు.