: నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ కానుక.. 23,494 పోస్టుల భర్తీకి ఆదేశం
తెలంగాణలోని నిరుద్యోగులకు కేసీఆర్ సర్కారు గణతంత్ర దినోత్సవ కానుక అందించింది. త్వరలో 23,494 ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర పోస్టుల భర్తీకి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేజీ టు పీజీ విద్యావిధానంలో భాగంగా నెలకొల్పిన, భవిష్యత్తులో నెలకొల్పబోయే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 20,299 ఉపాధ్యాయ పోస్టులు కాగా, 3,195 పోస్టులు బోధనేతర పోస్టులు ఉన్నాయి. అలాగే 2017-18 విద్యాసంవత్సరానికి తక్షణం 8,245 పోస్టులు భర్తీ చేయాలని, టీఎస్‌పీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.