: ప్రజలకు మరో షాకివ్వనున్న మోదీ ప్రభుత్వం.. మార్చి 31 లోపు రూ.2000 నోట్ల రద్దు?
ప్రజలకు మరోసారి షాకిచ్చేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 31 లోపు కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2 వేల నోట్లను కూడా రద్దు చేయాలని యోచిస్తున్నట్టు అఖిల భారత భారతీయ స్టేట్‌బ్యాంక్ అధికారుల సంఘం అధ్యక్షుడు థామస్ ఫ్రాంకో పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు తీవ్రంగా నష్టపోయారన్న ఆయన నోట్ల రద్దుపై బడాబాబులు, కార్పొరేట్ సంస్థలకు ముందుగానే ఉప్పందిందని ఆరోపించారు. ఈ కారణంగానే నల్లధనం అనుకున్న స్థాయిలో బయటకు రాలేదని థామస్ పేర్కొన్నారు.