: మూడు గంటల పాటు భద్రతా సిబ్బందికి కనిపించకుండాపోయిన ఏపీ మంత్రి!


ఏపీలో మంత్రి ఒకరు భద్రతా సిబ్బందికి కనిపించకుండా మూడు గంటల పాటు ఎక్కడికో వెళ్లిపోయారట. ఈ విషయమై ఆందోళన చెందిన భద్రతా సిబ్బంది పోలీస్ ఉన్నతాధికారులకు తెలియజేశారు. నిన్న రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు భద్రతా సిబ్బందికి చెప్పకుండా ఎక్కడికో సదరు మంత్రి వెళ్లిపోయారట. వెంటనే, మంత్రి కోసం పోలీసులు వెతకటం ప్రారంభించారు. అయితే, రాత్రి 10.30 గంటలకు సదరు మంత్రి అందుబాటులోకి రావడంతో భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారట.

ఈ విషయాన్ని ఈరోజు ఉదయం సీఎం చంద్రబాబు దృష్టికి ఉన్నతాధికారులు తీసుకువెళ్లారు. మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో ఈ విధంగా చేస్తే ఎలా? అని సీఎం వద్ద పోలీస్ అధికారులు వాపోయినట్లు సమాచారం. కాగా, సదరు మంత్రి ఎక్కడికి వెళ్లారనే విషయమై ఆరా తీయాలని అధికారులను సీఎం ఆదేశించారు. భద్రతా సిబ్బందికి మూడు గంటలపాటు కనిపించకుండా పోయిన ఆ మంత్రిపై చంద్రబాబు మండిపడ్డారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News