: ఇకపై ఇలాంటి నీచ రాజకీయాలు చేయాలంటే భయపడాలి.. జనసేన అంతిమ లక్ష్యం ఇదే!: పవన్ కల్యాణ్ స్పష్టీకరణ
ఇంతవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ సారి మొత్తం రాజకీయ నాయకులపై ట్వీట్ ఎక్కుపెట్టారు. పాలకులు, పాలకవర్గాలు గత యాభై ఏళ్లుగా వారివారి పార్టీల ప్రయోజనం కోసం చేసిన స్వార్థపూరిత కుట్రలకు ఏ తప్పు చేయని ప్రజలు ద్వేషంతో విడిచిపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా జరిగిన నిర్లక్ష్యపూరిత విభజనకి వచ్చిన నష్టాలను ఆంధ్రా, తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారని ఆయన చెప్పారు.
ఇప్పుడు ప్రత్యేకహోదా విషయంలో కూడా గత మూడేళ్లుగా మళ్లీ అలాంటి ధోరణి అవలంబిస్తూ మా ప్రజలను ఇంకెత నిరాశ, నిస్పృహల్లోకి నెడతారని ఆయన నిలదీశారు. ఇప్పుడు ఆంధ్రులు చేస్తున్న ఈ పోరాటం వల్ల సత్వర న్యాయం జరుగుతుందా? లేదా? అనే దానికంటే భవిష్యత్ లో ఇలాంటి నీచ రాజకీయాలు చేయాలంటే భయపడాలని, జనసేన అంతిమ లక్ష్యం ఇదే అని చెప్పిన పవన్ కల్యాణ్... దేశ ప్రజలందరికీ గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
#APDemandsSpecialStatus pic.twitter.com/k5a9UTarOU
— Pawan Kalyan (@PawanKalyan) January 25, 2017
#APDemandsSpecialStatus pic.twitter.com/BPQCaDoVR1
— Pawan Kalyan (@PawanKalyan) January 25, 2017