: ఏపీకి ప్రత్యేక హోదా రాదని నమ్ముతున్నాము: టీడీపీ నేత అవంతి శ్రీనివాస్


ఏపీకి ప్రత్యేక హోదా రాదని తాము నమ్ముతున్నామని టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో స్పష్టం చేసిందని, అందుకనే, ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ కు చట్టబద్ధత కల్పించాలని కోరుతున్నామన్నారు. ఏపీ ప్రయోజనాలకు ఇబ్బంది లేనంత వరకూ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని, తేడా వస్తే చూస్తూ ఊరుకోమని చెప్పారు.

ప్రత్యేక హోదా సాధన కోసం ‘జల్లికట్టు’ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని కొంతమంది ప్రకటనలు చేస్తుండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదాను ‘జల్లికట్టు’తో పోల్చి చూడటం సిగ్గుచేటని, రాజకీయ ప్రయోజనాల కోసమే అన్ని వర్గాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దేశభక్తి గురించి మాట్లాడే పవన్ రేపు తలపెట్టనున్న మౌన నిరసనను మానుకోవాలని, ఈ నిరసనకు యువత దూరంగా ఉండాలని అవంతి శ్రీనివాస్ పిలుపు నిచ్చారు.

  • Loading...

More Telugu News