: ప్రియాంకపై ఆ వ్యాఖ్యలు సరికాదు: వెంకయ్యనాయుడు


కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక గాంధీపై యూపీ బీజేపీ నేత వినయ్‌ కతియార్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో ఆ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వినయ్ కతియార్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఖండించారు. ఢిల్లీలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, అలాంటి మాటలు ఆమోద యోగ్యం కాదని అన్నారు. అలాగే శరద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన ఖండించారు.

ఓటును ఆడబిడ్డతో పోల్చడమే కాకుండా, కూతురు పరువుకంటే ఓటు గొప్పదనడం సరికాదని హితవు పలికారు. కాగా, ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ స్టార్‌ క్యాంపెయినర్‌ అని తాను అస్సలు అనుకోవడం లేదని, ఆమెకంటే అందమైన వాళ్లు ఎంతో మంది ప్రచారానికి ఉన్నారంటూ వినయ్ కతియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీ సంస్కారం ఇదేనంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. దీంతో ఆయన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ఖండించారు. 

  • Loading...

More Telugu News