: సుస్థిరతకు భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎడారిలో ఒయాసిస్: రాష్ట్రపతి ప్రణబ్


అశాంతి, అస్థిరత నెలకొన్న వేళ గత ఆరున్నర దశాబ్దాలుగా సుస్థిరతకు భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎడారిలో ఒయాసిస్ గా నిలిచిందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, ‘1951లో 36 కోట్ల జనాభా ఉండగా, ప్రస్తుతం అది 130 కోట్లకు చేరింది. అయినప్పటికీ తలసరి ఆదాయం పదిరెట్లు పెరిగింది. పేదరిక నిష్పత్తి మూడింట రెండు వంతులు తగ్గింది. సగటు జీవన కాలం రెట్టింపు అయింది. అక్షరాస్యత కూడా పెరిగింది. ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా పెరిగింది. శాస్త్ర, సాంకేతిక, మానవ వనరులు కల్గిన దేశాల్లో రెండో స్థానంలో ఉన్నాం. అతిపెద్ద సైనికశక్తి కలిగిన మూడో దేశంగా ఉన్నాం ... యువత విద్యా వ్యవస్థలోని ఆవిష్కరణలు అందిపుచ్చుకోవాలి. నగదు రహిత లావాదేవీలతో పారదర్శకత పెరుగుతుంది..’ అని ప్రణబ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

  • Loading...

More Telugu News