: మన జాతీయ జెండా వెలుగులతో మెరిసిపోతున్న దుబాయ్ 'బుర్జ్ ఖలీఫా'!


ప్రపంచంలోనే ఎత్తైన దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా టవర్ మన జాతీయ జెండాలోని త్రివర్ణాలతో మెరిసిపోయింది. భారత దేశ 68వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నేడు, రేపు దుబాయ్ లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే బుర్జ్ ఖలీఫా టవర్ ను మన జాతీయ జెండాలోని మూడు రంగుల వెలుగులతో ముస్తాబు చేశారు. కాగా, ఓడ్ మెతాలోని ఇండియన్ హై స్కూల్ తో పాటూ భారత రాయబార కార్యాలయంలో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు.

అంతేకాకుండా, ‘ఆజ్ కీ షామ్ దేశ్ కే నామ్’ పేరిట నిర్వహించనున్న సాంస్కృతిక కార్యక్రమంలో ఇండియన్ హై స్కూల్ విద్యార్థులు పాల్గొననున్నారు. కాగా, రేపు నిర్వహించే గణ తంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా అబుదాబి యువరాజ్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్-నవ్యాన్ ముఖ్య అతిథిగా భారత్ కు విచ్చేశారు. అబుదాబి యువరాజ్ తో ప్రధాని మోదీ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడేందుకు వారు నిర్ణయాలు తీసుకున్నారు.

  • Loading...

More Telugu News