: తన తండ్రిది హత్య అంటున్న మైఖేల్ జాక్సన్ కుమార్తె ప్యారిస్ జాక్సన్
ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ ది సహజ మరణం కాదని, హత్య అని అతని కుమార్తె ప్యారిస్ జాక్సన్ ఆరోపించింది. మైఖేల్ జాక్సన్ మృతిచెందిన అనంతరం మీడియా ముందుకు రాని ప్యారిస్ జాక్సన్ తొలిసారి తన తండ్రి మృతి గురించి నోరు విప్పడం విశేషం. తన తండ్రిని హత్య చేసినట్టే తనను కూడా హత్య చేస్తారని ప్యారిస్ ఆరోపించింది.
తన తండ్రి ఓవర్ డోస్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల మృతి చెందాడని అభిమానులు, దేశ ప్రజలను తప్పుదోవ పట్టించారని, వాస్తవానికి ఆయనను చంపేశారని తెలిపింది. ఏమాత్రం అనుమానం రాకుండా తన తండ్రిని తమకు దూరం చేశారని వాపోయింది. తనను కూడా ఏదో ఒకరోజు చంపేస్తారని చెప్పింది. ఆ రోజు జరిగిందంతా ఓ సెటప్ అని ఆమె తెలిపింది. ఈ విషయం అందరికీ తెలుసని ఆమె పేర్కొంది. అయితే ఎవరు చంపారు? ఎవరు చంపేస్తారు? అనే విషయాలను ప్యారిస్ జాక్సన్ వెల్లడించకపోవడం విశేషం.