: పవన్ కల్యాణ్ నాయకత్వం వహిస్తే ప్రత్యేకహోదా పోరులో కాంగ్రెస్ ఆయన వెనుకే ఉంటుంది: జగ్గారెడ్డి
ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కలిశారు. హైదరాబాదు శివార్లలో జరుగుతున్న కాటమరాయుడు షూటింగ్ స్పాట్ లో పవన్ కల్యాణ్ ను ఆయన కలిశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ తో సమావేశమై వివిధ విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేకహోదా కోసం జరుగుతున్న ఉద్యమానికి నాయకత్వం వహించాలని పవన్ కల్యాణ్ ను ఆయన కోరారు. పవన్ కల్యాణ్ నాయకత్వం వహిస్తే ఆయనకు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందని ఆయన తెలిపారు. 2019లో అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని ఆయన చెప్పారు.