: ఆ చర్చపై తన ప్రభావం పడకూడదని చంద్రబాబు బయటకు వచ్చేశారట!


అమరావతిలో ఈరోజు జరిగిన  ఏపీ కేబినెట్ భేటీలో పలు అంశాలకు ఆమోదముద్ర పడింది. హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’కి వినోదపు పన్ను మినహాయింపు నిస్తూ కేబినెట్ ఈ మేరకు ఆమోదముద్ర వేసింది. అయితే, ఈ చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపుపై కేబినెట్ లో చర్చ జరుగుతుండగా సీఎం చంద్రబాబు సమావేశం నుంచి లేచి బయటకు వెళ్లిపోయారు. బాలకృష్ణ తనకు బంధువు కావడంతో ఈ చర్చపై తన ప్రభావం ఉండకూడదనే చంద్రబాబు బయటకు వెళ్లారని టీడీపీ నేతలు అంటున్నారు. కాగా, ఈ చిత్రానికి  సెక్షన్ 8 ప్రకారం పన్ను రాయితీకి మంత్రులు ఆమోదం తెలిపారు. 

  • Loading...

More Telugu News