: దేశాన్ని రెండు ముక్కలు చేయడమే మంచిదేమో!: మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ యువనటుడు మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్కున్నోడు సినిమా ప్రమోషన్ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ, శాంతియుత పోరాటం వల్లే స్వాతంత్ర్యం వచ్చిందన్న సంగతిని జల్లికట్టు ఆందోళన గుర్తుచేస్తోందని, దానిని ఆదర్శంగా తీసుకుని మనమందరం రాష్ట్రానికి ప్రత్యేకహోదా తెచ్చేందుకు పోరాడాలని పిలుపునిచ్చాడు. ఆ పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన తెలిపాడు.
దక్షిణాది ప్రజలు నిర్ణయిస్తేనే కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయని, అయినప్పటికీ ఉత్తరాదిన మనవారికి సరైన గుర్తింపు ఉండడం లేదని చెప్పాడు. అలాంటప్పుడు ఒకే దేశంగా ఉండాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించాడు. అందుకే దేశాన్ని ఉత్తరాది, దక్షిణాది అంటూ రెండు భాగాలుగా విడగొట్టడమే మంచిదని అభిప్రాయపడ్డాడు. ఇక సినిమా హీరోలు నిర్మాతలను తమవారిగా భావించాలని సూచించాడు. తన లాంటి రేంజ్ హీరోలు 30 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమా తీస్తే పెట్టుబడి ఎలా వస్తుందని ప్రశ్నించాడు.