: మా అబ్బాయి గీసిన ‘ధోనీ’ చిత్రమిది: సెహ్వాగ్


తన తండ్రి డేషింగ్ బ్యాట్స్ మెన్ అయినప్పటికీ, టీమిండియా స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని అంటే మాత్రం వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ కు చాలా ఇష్టమట. ధోనీ అంటే తనకు ఎంత ఇష్టమనే విషయాన్ని ఆర్య వీర్ తన ‘స్కెచ్’ ద్వారా చెప్పాడు. ధోని బ్యాటింగ్ చేస్తున్న ఫొటో మాదిరి చిత్రాన్ని ఓ తెల్ల కాగితంపై పెన్సిల్ తో చిత్రీకరించాడు. ఈ విషయాన్ని సెహ్వాగ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు. ‘నా పెద్ద కొడుకు ఆర్యవీర్..ఎంఎస్ ధోని చిత్రాన్ని గీశాడు. చివరకు, ఈ చిత్రంలో కూడా మహీ బాది పారేస్తున్నాడు’ అని పేర్కొన్న సెహ్వాగ్, ఈ చిత్రాన్ని పోస్ట్ చేశాడు. 

  • Loading...

More Telugu News