: శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో హై అలర్ట్
గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో హైదరాబాద్ శివారు, శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులు తనిఖీలు నిర్వహిస్తోన్న అధికారులకు సహకరించాలని కోరారు. డొమెస్టిక్ ప్రయాణికులు తాము ఎక్కాల్సిన విమానం బయలుదేరడానికి 2 గంటల ముందుగా చేరుకోవాలని సూచించారు. ఇక వెబ్ ఆధారంగా ప్రయాణం నిర్ధారించుకున్న ప్రయాణికులు గంటన్నర ముందుగా తనిఖీ కేంద్రంలో సంప్రదించాలని చెప్పారు.
నిఘా సంస్థలు చేసిన హెచ్చరికల నేపథ్యంలో అన్ని అంశాలని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని అన్నారు. ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేసేందుకు 40 శాతం వరకు ఎక్స్‌రే యంత్రాలు, తనిఖీ పాయింట్లను పెంచినట్లు అధికారులు మీడియాకు తెలిపారు.