: షారూఖ్ ఖాన్ మమ్మల్ని మోసం చేశాడు: హృతిక్ తండ్రి రాకేష్ రోషన్


షారూఖ్ ఖాన్ తమను మోసం చేశాడని హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ ఆరోపించారు. నేడు షారూఖ్ 'రయీస్', హృతిక్ 'కాబిల్' బాక్సాఫీసులో తలపడుతున్న సంగతి తెలిసిందే. రంజాన్ కానుకగా విడుదల కావాల్సిన 'రయీస్' ను 'సుల్తాన్' కారణంగా వాయిదా వేశారు. అనంతరం ఈ సినిమా వివిధ కారణాలతో పలుమార్లు వాయిదాపడి చివరికి ఆరునెలలు ఆలస్యంగా విడుదైంది. 'కాబిల్' మాత్రం చెప్పిన డేట్ కు విడుదలైంది. ఈ నేపథ్యంలో ధియేటర్లను చేజిక్కించుకునేందుకు 'రయీస్' నిర్మాత షారూఖ్ ఖాన్, 'కాబిల్' నిర్మాత రాకేష్ రోషన్ తమ ప్రయత్నాలు తాము చేసుకున్నారు.

ఈ క్రమంలో ఎగ్జిబిటర్లు ఇబ్బందిలో పడగా, షారూఖ్ తో తాను 50:50 ఒప్పందానికి వచ్చినట్టు తెలిపారు. ఇది దేశవిదేశాల్లోని థియేటర్లకు వర్తిస్తుందని అన్నారు. అయితే దీనికి విరుద్ధంగా షారూఖ్ ఎగ్జిబిటర్లను మేనేజ్ చేసి 60:40 శాతం ధియేటర్లను కేటాయించేలా చేశారని ఆయన వాపోయారు. దీంతో 'రయీస్' కంటే 'కాబిల్' తక్కువ ధియేటర్లలో విడుదలైందని ఆయన చెప్పారు. తద్వారా తమకు 150 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎవరు కుట్రలు పన్నినా దేవుడు తమకు మంచే చేస్తాడని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News