: మంత్రి రావెలపై మండిపడ్డ చంద్రబాబు!
టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో మంత్రి రావెల కిషోర్ బాబు పై ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జెడ్పీ చైర్ పర్సన్ తో వివాదం, నియోజకవర్గం నుంచి రావెలపై వస్తున్న ఫిర్యాదులను ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు. వివాదాలతో పార్టీకి నష్టం చేస్తున్నారని, పార్టీలోకి కొత్తగా వచ్చినా అవకాశం దక్కిందన్న విషయాన్ని మర్చిపోతే ఎలా? అంటూ మండిపడ్డారు. వివాదాలతో పార్టీని ఇబ్బంది పెడితే సహించేది లేదని రావెలను చంద్రబాబు ఘాటుగా హెచ్చరించినట్లు సమాచారం.