: డ్యూయెట్ పాడాలని ఉంది... అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, సోనూ సూద్ లను అడుగుతాను: జాకీచాన్


ఫైట్లు చేసి విసిగిపోయానని, డ్యూయెట్లు పాడాలని ఉందని ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ హీరో జాకీచాన్ తెలిపారు. కుంగ్ ఫూ యోగ సినిమా ప్రమోషన్ కోసం ముంబై వచ్చిన ఆయన వివిధ మీడియా సంస్థలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చాలా విషయాలు పంచుకున్నారు. తనకు మనుషులతో పరిచయం పెంచుకోవడం, సంభాషించడం, ఇతరుల గురించి తెలుసుకోవడం చాలా ఇష్టమని చెప్పారు. ఈ వయసులో ఇంత ఎనర్జిటిక్ గా ఎలా ఉంటున్నారని అడగడంతో తాను మనుషులతో సంభాషించడానికి ఇష్టపడతాను కనుక ఇలా హుషారుగా ఉన్నానని, అదే ఒంటరిగా ఉంటే డీలా పడిపోతానని జాకీ తెలిపారు. చైనా, భారతీయ సినిమాలు ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ స్థాయిని సంతరించుకుంటున్నాయని జాకీ అన్నారు.

ఇప్పుడిప్పుడే చిత్రపరిశ్రమ కాస్త డబ్బును చూస్తోందని, ఇది కూడా పెద్ద స్థాయిని సంతరించుకుంటే భారీ సినిమాలు వస్తాయని ఆయన తెలిపారు. యాక్షన్ సినిమాలు చేసి విసిగిపోయానని జాకీ చెప్పారు. తనకు డిఫరెంట్ జానర్ లో ట్రై చేయాలని ఉందని అన్నారు. బాలీవుడ్ సినిమాలో అవకాశం వస్తే చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. భాష సమస్య కావడంతో తనకు బదులుగా కథ వినమని అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, సోనూ సూద్ వంటి మిత్రులకు చెబుతానని అన్నారు. వారు ఎవరైనా మంచి నిర్మాత, దర్శకుడి పేరు చెబితే వారితో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. ప్రేమ కథా చిత్రాల్లో నటించాలని ఉందని అందుకోసం చాలా సార్లు ప్రయత్నించానని, అయితే తన ప్రయత్నాలు ఫలించలేదని ఆయన చెప్పారు. 

  • Loading...

More Telugu News