: శాంతియుత పోరాటాన్ని నీరుకార్చితే రాష్ట్రయువత భవిష్యత్తుని నాశనం చేసిన‌ట్లే: ప‌వ‌న్ క‌ల్యాణ్‌


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా కోసం రాష్ట్ర యువ‌త రేపటి పోరాటానికి సిద్ధ‌మవుతున్న నేప‌థ్యంలో పోలీసులు చేస్తోన్న హెచ్చ‌రిక‌ల‌పై సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రో ట్వీటు వ‌దిలారు. ప్రత్యేకహోదాపై ప‌వ‌న్ ఈ రోజు ఉద‌యం నుంచి ఒక్కో గంట‌కి ఒక్కో ట్వీటు చేస్తూ ప్ర‌త్యేక హోదా ఉద్య‌మాన్ని అడ్డుకోవ‌ద్ద‌ని సూచిస్తూ.. హోదాపై రాష్ట్ర, కేంద్ర ప్ర‌భుత్వాల తీరుని ఎండ‌గ‌డుతున్నారు. తాజాగా ప‌వ‌న్ ‘యువత చెయ్యాలనుకుంటున్న ఏపీ ప్రత్యేక హోదా శాంతియుత పోరాటాన్ని ఎవరు నీరుకార్చినా, వారు రాష్ట్రయువత భవిష్యత్తుని నాశనం చెయ్యటమే...’ అని పేర్కొన్నారు.


  • Loading...

More Telugu News