: ప్రియాంకా గాంధీ కన్నా అందగత్తెలెందరో ఉన్నారు: బీజేపీ నేత వినయ్ కతియార్ సంచలన వ్యాఖ్యలు
సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకపై బీజేపీ ఎంపీ, సీనియర్ నేత వినయ్ కతియార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీలో కాంగ్రెస్ పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్లుగా ఆమె పేరును ప్రకటించడాన్ని ప్రస్తావిస్తూ, ప్రియాంకా గాంధీ కన్నా అందమైన మహిళలు చాలా మంది ఉన్నారని అనుచితంగా మాట్లాడారు. యాక్టర్లు, ఆర్టిస్టులను ప్రియాంకతో పోలిస్తే బాగుంటారని చెప్పారు. వారిని ముందు నిలిపి ప్రచారం చేసుకోవాలని సలహా ఇచ్చారు. వినయ్ కతియార్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడుతోంది.