: తాలిపేరు బ్రిడ్జ్ ని పేల్చేందుకు ఐదు కిలోల మందుపాతర... పోలీసులు గుర్తించడంతో తప్పిన పెను ముప్పు


భద్రాచలం సమీపంలోని చర్ల మండలం తాలిపేరు బ్రిడ్జి కింద అమర్చిన శక్తిమంతమైన మందుపాతరను పోలీసులు ఈ ఉదయం నిర్వీర్యం చేశారు. బ్రిడ్జ్ ని పేల్చి వేసేందుకు ఐదు కిలోల మందుపాతరను అమర్చారని, దాన్ని గుర్తించడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కాగా, ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉండటంతో వారే దీన్ని అమర్చి వుంటారని అంచనా వేస్తున్నారు. తాలిపేరు బ్రిడ్జ్ పై నిత్యమూ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు ప్రయాణిస్తుంటాయి. దీంతో వారిని టార్గెట్ గా చేసుకుని మందుపాతర పేల్చాలన్నది మావోల ఆలోచన కావచ్చని అధికారులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News