: కేంద్రం నుంచి ఎంతొస్తే అంతా తెచ్చుకుందాం: కోడెల
ఈ ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరుగగా, స్పీకర్ కోడెల తొలిసారిగా హాజరయ్యారు. విద్యుత్ చార్జీలను పెంచాలన్న డిస్కంల ప్రతిపాదనల నుంచి రాష్ట్ర బడ్జెట్, రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు, ఇంటి అద్దెల నియంత్రణ బిల్లు తదితర అంశాలు చర్చకు వచ్చాయి. రేపు వివిధ ప్రాంతాల్లో తలపెట్టిన ప్రత్యేక హోదా నిరసనలపైనా మంత్రులతో చంద్రబాబు మాట్లాడారు. ఈ సమావేశం అనంతరం కోడెల మీడియాతో మాట్లాడుతూ, జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సుకు సీఎంను ఆహ్వానించేందుకే తాను వచ్చినట్టు తెలిపారు. చంద్రబాబు సహా మంత్రులందరినీ ఆహ్వానించానని తెలిపిన ఆయన, కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎంత లబ్ది వస్తే అంత తెచ్చుకోవాలని అన్నారు. అది హోదానా? లేదా ప్యాకేజీయా? అన్నది తాను చెప్పకూడదని కోడెల వ్యాఖ్యానించారు.