: మాజీ ప్రియుడిని ఇంటికి పిలిచి కత్తితో పొడిచిన గృహిణి!


మధ్యప్రదేశ్‌లోని భోపాల్ పరిధిలోని సిద్ది జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ గృహిణి తాను గ‌తంలో ప్రేమించిన యువ‌కుడిని ఇంటికి పిలిచి మ‌రీ క‌త్తితో తీవ్రంగా దాడి చేసింది. విశేషం ఏమిటంటే, తాను మ‌రొక‌రిని పెళ్లి చేసుకొని చక్కగా కాపురం చేస్తోంది.. అయితే, త‌న ప్రియుడికి పెళ్లికాబోతోంద‌ని తెలుసుకొని తట్టుకోలేకపోయింది. దాంతో ఈ దారుణానికి ఒడిగ‌ట్టింది. ప్రియుడికి వేరే యువతితో పెళ్లి చేయబోతున్నారన్న సంగతి తెలుసుకున్న ఆమె.. అతనికి ఫోన్ చేసి త‌న‌ ఇంటికి రమ్మ‌ని చెప్పింది. వెంట‌నే అక్క‌డ‌కు వెళ్లిన ప్రియుడిని అత‌డి పెళ్లి విషయంపై నిల‌దీసింది. దీంతో, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని, కానీ ఇంకా కుదరలేదని అన్నాడు.

అయినా వినిపించుకోకుండా అత‌డితో కొట్లాట‌కు దిగి కత్తితో విచ‌క్ష‌ణార‌హితంగా గాయపరిచింది. తన ప్రియుడి జననేంద్రియాలను గాయపరిచింది. అనంత‌రం స‌ద‌రు ప్రియుడు అక్క‌డి నుంచి త‌ప్పించుకున్నాడు. ప్ర‌స్తుతం అత‌డు సంజయ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News