: మహిళా ఎంపీని పార్లమెంటు సాక్షిగా లైంగికంగా వేధించిన పాక్ మంత్రి


పాకిస్థాన్ పార్లమెంటు సాక్షిగా, ఓ మహిళా ఎంపీ లైంగిక వేధింపులకు గురయ్యారు. స్వయంగా మంత్రే ఆమెను తన కార్యాలయంలోకి పిలిచి వేధించారు. సింధ్ ప్రావిన్స్ కు చెందిన ఎంపీ నుస్రాత్ సహార్ అబ్బాసీని, పార్లమెంటులోని తన వ్యక్తిగత కార్యాలయానికి పిలిచిన మంత్రి ఇమాద్ పితాఫీ, ఆపై ఆమెను వేధించాడు. ఈ విషయంలో తాను ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ స్పందించలేదని, దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని నుస్రాత్ ఆరోపించింది. డిప్యూటీ స్పీకర్ మహిళ అయివుండి కూడా, తనకు జరిగిన అన్యాయాన్ని గురించి చెబితే, మద్దతుగా నిలవలేదని ఆమె మీడియాకు తెలిపారు. ఈ విషయం బయటకు పొక్కిన తరువాత, సోషల్ మీడియాలో నుస్రాత్ కు మద్దతు పెరగగా, నుస్రాత్ ఆరోపణలపై విచారణకు ఆదేశించినట్టు ఫెడరల్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News