: కమాండర్ ను కాల్చి చంపిన జవాను!


తోటి జవానుని మరో జవాను కాల్చి చంపిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది. సీఏఎఫ్ కమాండర్ హోదాలో ప‌నిచేస్తోన్న విశ్వనాథ్(57)ని అదే బెటాలియన్‌లో పనిచేస్తోన్న సమర్ శేఖర్ (29) సర్వీస్ రివాల్వర్‌తో కాల్చాడు. సీఏఎఫ్ 14వ బెటాలియన్‌లో జ‌రిగిన ఈ ఘటనపై సంబంధిత అధికారులు మాట్లాడుతూ... విశ్వనాథన్‌ను స‌మ‌ర్ శేఖ‌ర్ కాల్చ‌గానే అక్క‌డ ఉన్న‌ మిగతా సహచరులు ఆయ‌న‌ను వెంట‌నే అథాగర్ ఆసుపత్రికి తరలించారని తెలిపారు. అయితే, చికిత్స పొందుతూ విశ్వనాథ్ మృతి చెందార‌ని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామ‌ని అన్నారు.

  • Loading...

More Telugu News