: అమ్మ పెట్టదు... అడుక్కు తిననివ్వదు అన్నట్లుంది: మరో ట్వీటేసిన పవన్


ప్రత్యేక హోదాపై తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ, ప్రభుత్వ, ప్రజా ప్రతినిధుల వైఖరిని ప్రశ్నిస్తున్న పవన్ కల్యాణ్, ఈ మధ్యాహ్నం 12:45 గంటల సమయంలో మరో ట్వీట్ వదిలారు. "అమ్మా పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్న సామెతలాగ, ఏపీ స్పెషల్ స్టేటస్ కి మీరు పోరాటం చెయ్యరు, చేసే వారిని చెయ్యనివ్వరు... మరి ఎలా?" అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న వారికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. కాగా, రేపు విశాఖపట్నం ఆర్కే బీచ్, విజయవాడ కృష్ణా తీరం, తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ ప్రాంగణాల్లో యువత ర్యాలీలకు, నిరసన ప్రదర్శనలకు నిర్ణయించగా, అందుకు పోలీస్ శాఖ అనుమతి నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News