: ముఖ్య‌మంత్రిని అడ్డ‌గోలుగా తిట్టే కార్య‌క్ర‌మం చేస్తున్నారు: మ‌ంత్రి దేవినేని


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చిన‌ప్ప‌టినుంచి పెండింగ్ ప్రాజెక్టులు ఎన్నో పూర్తి చేశామ‌ని, ప‌ట్టిసీమ‌ను పూర్తి చేసి నీరు అందిస్తున్నామ‌ని, ఇప్పటికే ఎన్నో ఎక‌రాల‌కు నీరు అందించామ‌ని మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌రరావు అన్నారు. ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన‌ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తున్నామ‌ని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుని అడ్డ‌గోలుగా తిట్టే కార్య‌క్ర‌మం చేస్తున్నారని వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిపై ఆయ‌న మండిప‌డ్డారు. అమ‌రావ‌తి నిర్మాణంలో ఒక ఇటుక కూడా పెట్టలేదంటూ జ‌గ‌న్ విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని, రాజధాని అమరావతిలో చేపట్టే కార్యక్రమాలకు త‌న‌కు ఆహ్వాన ప‌త్రిక కూడా పంపిచ‌కూడ‌ద‌న్నాడని, తాను రానని జగన్ అన్నాడని, త్వ‌ర‌లో అమ‌రావతిలో జ‌రిగే అసెంబ్లీ స‌మావేశాల‌కు ఏ మొహం పెట్టుకొని వ‌స్తారో చూస్తామని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News