: జల్లికట్టుకి మరో అడ్డు?... జల్లికట్టు క్రీడకు సానుకూలంగా వచ్చిన ఆర్డినెన్స్‌పై సుప్రీంలో పిటిషన్
తమ సంప్రదాయంగా వస్తోన్న జల్లికట్టు క్రీడ నిర్వహించకుండా సుప్రీంకోర్టు నిషేధం విధించిన నేపథ్యంలో తమిళులు ఇటీవలే భారీ ఎత్తున పోరాటం చేసి పలు చోట్ల విధ్వంసాలకు పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం జల్లికట్టు క్రీడ నిర్వహించడానికి వీలుగా ఆర్డినెన్స్ జారీ చేసి, ఆ వెంటనే అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి చట్టంగా రూపొందించింది. అయితే, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ జంతు సంరక్షణ బోర్డు(యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా- ఏడబ్ల్యూబీఐ) తో పాటు ఇతర సంస్థలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై విచారించిన సుప్రీంకోర్టు ఈ రోజు వాటిని విచారణకు స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. ఈ నెల 30న జల్లికట్టు వ్యతిరేక పిటిషన్లు అన్నింటినీ ఒకేసారి విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.