: ఈయన పోయాడంటే రాష్ట్రానికి 25 కోట్లు ఫటక్... ఢాం!: చంద్రబాబు టూర్లపై జగన్ సెటైర్


ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, చంద్రబాబు విదేశీ పర్యటనలకు వెళ్లి ఉత్త చేతులతో తిరిగివస్తూ, తానేదో సాధించుకు వచ్చినట్టు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. "దావోస్ కు ఊరికే పేరుకు మాత్రమే పోతారు. పోయిన ప్రతిసారీ ప్రైవేటు విమానాల్లో మాత్రమే పోతాడు. నాలుగు రోజులు స్విట్జర్లాండులో మంచును చూసి చలికి విలాసవంతంగా గడిపి వస్తారు. ఈయన పోయాడంటే, రాష్ట్రానికి ఓ 25 కోట్లు ఫటక్... ఢాం. విశాఖపట్నంలో సమ్మిట్ అంటారు. ఒక్కో సమ్మిట్ జరగాలంటే 40 కోట్లు, 44 కోట్లు ఢాం రెండు రోజులకు. ఈవెంట్ మేనేజ్ మెంట్ చేస్తూ, చంద్రబాబునాయుడు అబద్ధాలతో మభ్యపెడుతున్నారు. 12 రోజుల పాటు పుష్కరాలు జరుపుతారు... 1600 కోట్లు ఫట్. గోదావరి 12 రోజుల పుష్కరాలకు 1600 కోట్లు ఫట్.

రాజధానికి ఫౌండేషన్ స్టోన్ వేస్తానంటాడు. ఒక్కరోజు పండగ, ఒక్కరోజు ఫెస్టివల్... 400 కోట్లు ఫట్. టెంపరరీ సెక్రటేరియట్... 6 లక్షల ఎస్ ఎఫ్టీకి 650 కోట్లు ఫట్. ఏదైనా టెంపరరీ అంటాడు. ఎక్కడికి పోయినా ప్రైవేటు విమానాల్లో పోతాడు. వందలు, వందలు వేల వేల కోట్ల రూపాయలను ఈవెంట్ మేనేజ్ మెంట్ పేరిట దోచుకుంటున్నారు. నామినేషన్ పద్ధతిలో వర్క్ లివ్వడం, టెండర్లు లేకుండా పిలవడం... వారికి నచ్చిన వాళ్లకు ఇవ్వడం, వాళ్లతో కమిషన్లు మాట్లాడుకోవడం. పోలవరం దగ్గర్నుంచి కాంట్రాక్టర్ల వరకూ స్కాములే. బొగ్గు నుంచి ఇసుక దాకా... ఇసుక నుంచి రాజధాని భూముల దాకా స్కాములే"నని నిప్పులు చెరిగారు.

ఈ స్కాముల నుంచి బయటపడేందుకే చంద్రబాబు అవసరమున్నా ఢిల్లీని ప్రశ్నించడం లేదని ఆరోపించారు. సూట్ కేసులో బ్లాక్ మనీని పెట్టి, వాటిని పంచుతూ, అడ్డగోలుగా ఆడియో, వీడియో టేపులకు దొరికిపోయినా, విచారణ నుంచి తప్పించుకున్నారు. ఇటువంటి ఘటన దేశంలో మరెక్కడా జరగదేమో. ఆ మనిషి జైలుకు పోకుండా, పదవికి రాజీనామా చేయకుండా... ఇలా ఒక్క మన రాష్ట్రంలోనే జరుగుతుందేమోనంటే... ఏ లెవెల్ లో చంద్రబాబు రాజీపడ్డారో చెప్పడానికి ఇదే నిదర్శనమని అన్నారు.

  • Loading...

More Telugu News