: పోలింగ్‌లో అక్రమాలు జరిగాయి.. ట్రంప్ చెప్పింది నిజమే: వైట్‌హౌస్


అమెరికా ఎన్నిక‌ల్లో అక్ర‌మాలు జ‌రిగాయని ఆ దేశ‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ చేసిన వ్యాఖ్య‌లపై శ్వేత‌సౌధం స్పందించింది. ట్రంప్ చేసినవి నిరాధార ఆరోప‌ణ‌లు కావ‌ని స్ప‌ష్టం చేసింది. తాజాగా శ్వేత‌సౌధ‌ మీడియా కార్యదర్శి సియాన్‌ స్పైసర్‌ మాట్లాడుతూ... ఎన్నికల్లో లక్షల మంది అక్రమంగా ఓట్లు వేశారనే విషయాన్ని ట్రంప్‌ బలంగా నమ్ముతున్నట్లు చెప్పారని అన్నారు. అయితే, మీడియా అడిగిన ఆధారాలను ఇచ్చేందుకు ఆయ‌న‌ అంగీకరించలేదని చెప్పారు. ఈ అంశంపై  పరిశోధనలు జరిగాయని, ఆధారసహితంగానే ఆయ‌న‌ ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. ఇటీవ‌లే డొనాల్డ్ ట్రంప్ ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ తాను పాప్యులర్‌ ఓటు కోల్పోయాన‌ని, దానికి కార‌ణం అక్రమ ఓటర్లేన‌ని అన్నారు. అనంత‌రం స్పైసర్ ఇటువంటి వివరణ ఇవ్వటం విశేషం.

  • Loading...

More Telugu News