: 'పెద్దలు అయ్యన్నపాత్రుడుగారూ...' అంటూ పవన్ వ్యంగ్యాస్త్రాలు!


చేతనైతే మోదీ దగ్గరకు వెళ్లి మాట్లాడి ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకు రావాలని మంత్రి అయ్యన్నపాత్రుడు తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ స్పందించారు. "పెద్దలు అయ్యన్నపాత్రుడు గారు... నేను మోదీ గారితో మాట్లాడితే బాగుంటుందని అన్నారు. నేను వారికి చెప్పేదేమిటంటే, నేను మోదీ గారితో ప్రచార సభల్లోనే పాల్గొన్నాను. కానీ మీ ఎంపీలు అందరూ పార్లమెంట్ లో ఆయనతో కూర్చుంటున్నారు కదా?.. మరి వారేం చేస్తున్నారు? మీడియా ముందుకు వచ్చి కేంద్రం స్పెషల్ స్టేటస్ ఇవ్వదని చెప్పడం తప్ప. అసలు ఇస్తారో ఇవ్వరో తరువాత సంగతి. ప్రజల అసంతృప్తిని కేంద్రానికి చెప్పడానికి కూడా మీరు భయపడితే ఎలా..?" అని తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు పవన్.

  • Loading...

More Telugu News