: ఆంధ్రులు కేంద్ర నాయకులకు బానిసలు కారు!: పవన్ కల్యాణ్ ఏకవాక్య విమర్శ
ఆంధ్రా ప్రజలు బానిసలేమీ కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును పెట్టారు. "ఆంధ్రులు.. ఈ దేశ ప్రజలు.. కేంద్రంలో ఉండే నాయకులకి, పార్టీలకి బానిసలు కారు..." అంటూ ఏకవాక్య విమర్శ చేశారు. 40 నిమిషాల క్రితం పవన్ ఈ పోస్టు పెట్టగా, ఇప్పటికే వేల సంఖ్యలో రీట్వీట్లను తెచ్చుకుంది. కాగా, నాయకులు పని చేయకపోబట్టే యువత రోడ్లపైకి వస్తోందని, మీరు ఏమీ చేయక, యువతను చేయనీయకపోతే సమస్యకు పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుందని పవన్ కల్యాణ్ గత రాత్రి ప్రశ్నించారు.
#APDemandsSpecialStatus ఆంధ్రులు ..ఈ దేశ ప్రజలు..
— Pawan Kalyan (@PawanKalyan) January 25, 2017
కేంద్రం లొ వుండె నాయకులకి,పార్టిలకి బానిసలు కారు..
'