: రియల్ హీరోలకు 'పద్మ' పురస్కారాలు... జాబితాలో సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, రఘురాం రాజన్!


ఈ సంవత్సరం పద్మ పురస్కారాలు రియల్ హీరోలకు దగ్గర కానున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే పద్మ అవార్డు విజేతల జాబితా సిద్ధం కాగా, నేటి సాయంత్రం అధికారికంగా పేర్లను ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ సంవత్సరం పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డులను అందుకోబోయే వారిలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ ఉన్నతాధికారి సత్య నాదెళ్ళ, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్, అమెరికాలోని సౌత్ కరోలినా గవర్నర్ నిక్కీ హేలీ పేర్లు ఉన్నట్టు అధికార వర్గాల సమాచారం.
వీరితో పాటు ఒలింపిక్స్ పతకం సాధించిన పీవీ సింధు, ఆమె కోచ్ గోపీచంద్, క్రికెటర్ ఎంఎస్ ధోనీ పేర్లు కూడా ఖరారైనట్టు తెలుస్తోంది. తెలంగాణ నుంచి 25 మంది పేర్లను పద్మ అవార్డుల నిమిత్తం కేంద్రానికి సిఫార్సు చేయగా, వీరిలో 10 మందిని అవార్డు కమిటీ ఎంపిక చేసినట్టు సమాచారం.
రచయిత సుక్రీ బొమ్మ గౌడ, పశ్చిమ బెంగాల్ జానపద గాయకుడు హిమ్రత్ సింగ్, ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్ అలోక్ సాగర్ పేర్లున్నాయని తెలుస్తోంది. కేసీఆర్ సర్కారు పంపిన జాబితా నుంచి చెన్నమనేని హనుమంతరావు, కే కుమార్, అందెశ్రీ, చుక్కా రామయ్య, సుద్దాల అశోక్ తేజలకు అవార్డులు ఖరారైనట్టు సమాచారం.

  • Loading...

More Telugu News