: తమ్ముడికి సపోర్ట్ గా నిలిచిన నాగబాబు!
ప్రత్యేక హోదాపై పవన్ చేపట్టిన ఆందోళనకు మెగా బ్రదర్ నాగబాబు పూర్తి మద్దతు ప్రకటించాడు. హోదా ఆంధ్రప్రజల హక్కని, దానికోసం పోరాడుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అండగా నిలుస్తానని సోషల్ మీడియా ద్వారా నాగబాబు పేర్కొన్నారు. ఈ అంశంలో పోరాటానికి దిగే ఇతర రాజకీయ పార్టీల నేతలకూ, యూనివర్శిటీల విద్యార్థినీ విద్యార్థులకు, మెగా అభిమానులకు సైతం మద్దతిస్తానని చెప్పారు. తన సోదరుడి ఆదర్శాలు, ఆలోచనా విధానంతో ఏకీభవిస్తున్నానని, విశాఖపట్నం లోని ఆర్కే బీచ్ లో రేపు జరిగే శాంతి ర్యాలీకి తన మద్దతు ఉంటుందని తెలిపారు.