: మోదీతో మాటల తరువాత శుభవార్త వినిపించిన ట్రంప్... ఫెడరల్ కమ్యూనికేషన్స్ చీఫ్ గా ఎన్నారై


భారత ప్రధాని నరేంద్ర మోదీతో గత రాత్రి 11:30 గంటల సమయంలో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆపై శుభవార్త వినిపించారు. ఫెడరల్ కమ్యూనికేషన్స్ చీఫ్ గా అజిత్ వరదరాజ్ పాయ్ ని నియమిస్తున్నట్టు వైట్ హౌస్ ప్రకటించింది. గతంలో నెట్ న్యూట్రాలిటీని తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన్ను ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పోస్టుకు ట్రంప్ ఎంచుకోవడం గమనార్హం. ఇప్పటికే నిక్కీ హేలీ, సీమా వర్మ, ప్రీత్ భరారా వంటి ప్రవాస భారతీయులను ముఖ్యమైన పదవుల్లో డొనాల్డ్ ట్రంప్ నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా అజిత్ నియామకంతో యూఎస్ ప్రభుత్వంలో భారత సంతతికి చెందిన నలుగురికి స్థానం దక్కినట్లయింది. వీరంతా ఇండియాతో అమెరికాకున్న స్నేహ బంధాన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు సహకరిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News