: విజయవాడైనా, ప్రొద్దుటూరైనా... ఇక ఏపీలో ఎక్కడికెళ్లినా ఒకే బంగారం ధర
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర తక్కువగా ఉండే పట్టణం అంటే తొలుత గుర్తొచ్చేది ప్రొద్దుటూరే. ప్రొద్దుటూరులో బంగారం ధర పది గ్రాములకు మిగతా ప్రాంతాలకన్నా రూ. 400 నుంచి రూ. 500 వరకూ తక్కువగా ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇకపై అలా ఉండదు. రాష్ట్రంలోని అన్ని బంగారు దుకాణాల్లో ఒకే ధరకు బంగారం, వెండి విక్రయాలు సాగించాలని ఏపీ బులియన్ బంగారు, వెండి, వజ్రాల వ్యాపారుల సంఘం నిర్ణయించింది. 13 జిల్లాల ఆభరణాల వర్తకుల మధ్య నెల్లూరులో ప్రత్యేక సమావేశం జరుగగా, సంఘంలో సభ్యత్వమున్న దుకాణదారులు హాజరయ్యారు. అన్ని దుకాణాల్లో ఒకే ధర అమలు చేయాలని నిర్ణయించినట్టు వర్తకుల సంఘం ప్రతినిధి శాంతిలాల్ జైన్ వెల్లడించారు.