: రూ.26తో రీచార్జ్ చేయించుకోండి.. 26 గంటలు మాట్లాడుకోండి.. బీఎస్ఎన్ఎల్ రిపబ్లిక్ డే ఆఫర్.. నేటి నుంచే!
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. రూ.26 తో రీచార్జ్ చేసుకోవడం ద్వారా బీఎస్ఎన్ఎల్ పరిధిలో 26 గంటల పాటు లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్‌ను అపరిమితంగా చేసుకోవచ్చని పేర్కొంది.
నేటి(25వ తేదీ) నుంచి ఈనెల 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. దీంతోపాటు మరో రెండు ఆఫర్లను కూడా ప్రకటించింది. కాంబో 2601 పేరుతో అందిస్తున్న ఆఫర్‌లో భాగంగా రూ.2600తో రీచార్జ్ చేసుకుంటే రూ.1300 అదనపు టాక్‌టైం పొందవచ్చు. రూ.2600 మెయిన్ బ్యాలెన్స్‌లో జమ అవుతుంది. అదనపు టాక్‌టైమ్ సెకండరీ అకౌంట్‌లో జమ అవుతుంది. దీనిని మూడు నెలల్లోపు వినియోగించుకోవచ్చని సంస్థ చైర్మన్ శ్రీవాస్తవ తెలిపారు. అలాగే ‘కాంబో 6801’ పేరిట తీసుకొస్తున్న మరో ఆఫర్‌లో రూ. 6800తో రీచార్జ్ చేసుకోవడం ద్వారా అంతే మొత్తం మెయిన్ బ్యాలెన్స్‌లో లభించడంతోపాటు మరో రూ.6800 సెకండరీ అకౌంట్‌లో జమ అవుతుంది. దీనిని మూడు నెలల్లో వినియోగించుకోవాలని, మెయిన్ బ్యాలెన్స్‌కు మాత్రం కాలపరిమితి ఉండదని శ్రీవాస్తవ పేర్కొన్నారు.