: వీధికుక్కల దాడిలో కన్నడ హీరోయిన్ కు తీవ్ర గాయాలు


తన పెంపుడు కుక్కను తీసుకుని వాకింగ్ కు వెళుతున్న కన్నడ హీరోయిన్ పారుల్ యాదవ్ పై వీధి కుక్కలు దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ముంబైలోని జోగేశ్వర్ రోడ్ లో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. తన పెంపుడు శునకాన్ని రక్షించే క్రమంలో వీధికుక్కలను తరిమేందుకు పారుల్ ప్రయత్నించగా, అవన్నీ మూకుమ్మడిగా ఆమెపై దాడి చేశాయి. పారుల్ తల, చేతులు, కాళ్లపై తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న పారుల్ సోదరి శీతల్, స్థానికుల సాయంతో ఆమెను రక్షించి దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు.

  • Loading...

More Telugu News