: మోదీకి ఫోన్ చేసి మాట్లాడిన ట్రంప్.. హెచ్1బీ వీసాలు, మేకిన్ ఇండియాపై చర్చ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతరాత్రి 11.30 గంటల సమయంలో ప్రధాని నరేంద్రమోదీతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక వాణిజ్యం, హెచ్1బీ వీసాలు, మేకిన్ ఇండియా, మేకిన్ అమెరికా, రక్షణ విషయాలపై చర్చించారు. అలాగే ఇరువురి పర్యటనలకు సంబంధించిన అంశాల గురించి కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటి వరకు నాలుగు దేశాల అధినేతలతో మాట్లాడారు. ఐదో వ్యక్తి ప్రధాని మోదీ. ఇక్కడ చిన్న విశేషం ఏంటంటే.. ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన తర్వాత అభినందిస్తూ ఫోన్ చేసిన తొలి ఐదుగురిలో మోదీ ఒకరు. ఇప్పుడు అధ్యక్షుడి హోదాలో ట్రంప్ మాట్లాడుతున్న తొలి ఐదుగురిలో మోదీ కూడా ఉండడం గమనార్హం.