: 3 కోట్ల విలువైన పాము విషం స్వాధీనం!
3 కోట్ల రూపాయల విలువైన పాము విషాన్ని బిహార్ లోని పూర్నియా ప్రాంతంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్తున్న 900 గ్రాముల బరువైన కోబ్రా విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో ఈ విషం విలువ అక్షరాలా మూడు కోట్ల రూపాయలుంటుందని తెలుస్తోంది. కాగా పాము విషాన్ని రకరకాల ఔషధాలు, సౌందర్య సాధనాల్లో వాడుతారు.