: జెట్ ఎయిర్ వేస్ విమానానికి తప్పిన పెను ప్రమాదం


బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా విమానాశ్రయంలో జెట్ ఎయిర్ వేస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ముంబై నుంచి ఢాకా వెళ్లిన జెట్‌ ఎయిర్వేస్ బి737-800 విమానం ల్యాండ్‌ అవుతుండగా వీల్స్ కంటే ముందు తోకభాగం రన్ వేను ఢీకొట్టింది. దీంతో విమానం పెను కుదుపుకు లోనైంది. పర్యవసానంగా విమానంలో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే ల్యాండింగ్ సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో అంతా క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనలో విమానం తీవ్రంగా దెబ్బతిందని అధికారులు తెలిపారు. ఈ విమాన ప్రమాదంపై విచారణ జరుపుతున్నట్టు డీజీసీఏ అధికారులు తెలిపారు. దీనికి బాధ్యులుగా భావించిన ఇద్దరు పైలట్లను విధుల నుంచి జెట్ ఎయిర్ వేస్ తప్పించింది. దీనిపై బోయింగ్ అధికారులు కూడా విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News