: 12 మంది టాప్ సీఈవోలకు బ్రేక్ ఫాస్ట్ పెట్టి వార్నింగ్ ఇచ్చిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టాప్ 12 అమెరికా సీఈవోలను బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ కు ఆహ్వానించారు. మీటింగ్ కు వచ్చిన సీఈవోలకు పసందైన విందునిచ్చిన ట్రంప్ గుండెలదిరే వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ మీటింగ్ సందర్భంగా వాణిజ్య పరంగా అమెరికా ప్రభుత్వం తీసుకోనున్న చర్యలను వారికి వివరించారు. ఉత్పత్తి రంగాన్ని తిరిగి అమెరికాకు తీసుకురావాలని వారికి సూచించారు. అలా కాకుండా కంపెనీలు ఉద్యోగాలను విదేశాలకు తరలించాలనుకుంటే, భారీ మొత్తంలో సరిహద్దు పన్నును చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అదేవిధంగా అమెరికాలోనే ఉత్పత్తులను తయారు చేస్తూ ఉద్యోగాలు కల్పించే సంస్థలను ప్రోత్సహించేందుకు భారీమొత్తంలో పన్ను రాయితీలు, నిబంధనల్లో వెసులుబాటు కల్పించనున్నామని వారికి తెలిపారు.