: ఆర్కేబీచ్ కి వచ్చేస్తామంటే చూస్తూ ఊరుకోము!: ఏపీ డీజీపీ సాంబశివరావు


సోషల్ మీడియా ద్వారా ఇచ్చే పిలుపులకి విలువ ఉండదని ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో నిరసన జరుగుతుంది, రండి అని పిలుపునిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అలా ఎవరు పడితే వాళ్లు పిలుపునిస్తే శాంతి భద్రతలు ఎవరు పరిరక్షిస్తారని ఆయన ప్రశ్నించారు. నిరసన కార్యక్రమానికి అనుమతి కావాలంటూ ఇంతవరకు తమను ఎవరూ సంప్రదించలేదని చెప్పారు. ఒకవేళ ఇప్పుడు అనుమతి అడిగినా బందోబస్తు ఏర్పాటు చేయడం కష్టమని చెప్పారు. ఆర్కే బీచ్ లో నిరసనకు అనుమతి లేదని ఆయన తెలిపారు. శాంతి భద్రతల సమస్య ఎదురైతే చూస్తూ ఊరుకోమని ఆయన స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News