: దక్షిణ చైనా సముద్రంపై మా హక్కులు మేము కాపాడుకుంటాం: స్పష్టం చేసిన అమెరికా


అధ్యక్షుడిగా ట్రంప్ పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టిన అనంతరం చైనాకు అమెరికా తమ వైఖరి స్పష్టంగా తెలియజేసింది. దక్షిణ చైనా సముద్రం విషయంలో తమ ప్రయోజనాలను తాము కాపాడుకుంటామని ప్రకటించింది. అంతర్జాతీయ ప్రాదేశిక ప్రాంతాలను 'ఒక దేశం' స్వాధీనం చేసుకోకుండా అడ్డుకుంటామని స్పష్టం చేసింది. 'దక్షిణ చైనా సముద్రంలో పలు ప్రాంతాలు అంతర్జాతీయ జలాలు, అంతర్జాతీయ కార్యకలాపాల కిందకు వస్తాయి. అక్కడి మా ప్రయోజనాలను కాపాడుకుంటామని అమెరికా కచ్చితంగా చాటిచెప్పగలదు' అని వైట్‌ హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ సీన్‌ స్పైసెర్‌ ప్రకటించారు. 'దక్షిణ చైనా సముద్రంలోని దీవులు అంతర్జాతీయ జలాల లోనివే. అవి చైనాకు చెందినవి కావు. అంతర్జాతీయ ప్రాదేశిక ప్రాంతాలను ఒక దేశం స్వాధీనం చేసుకోకుండా మేం అండగా నిలబడతాం అన్నది చాటుతాం' అని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News