: రజనీకాంత్ ను, నన్ను కలసి ఎవరు భరించగలరు?: కమలహాసన్
రజనీకాంత్ తో కలిసి నటిస్తానని ప్రముఖ నటుడు కమల హాసన్ తెలిపాడు. తామిద్దరం కలిసి నటించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని, అయితే తామిద్దర్నీ ఎవరు భరించగలరని కమల్ ప్రశ్నించాడు. కెరీర్ తొలినాళ్లలో కమల హాసన్, రజనీకాంత్ కలసి పలు సినిమాల్లో నటించారు. 1975లో తొలిసారి వీరిద్దరూ 'అపూర్వరాగంగళ్' సినిమాలో నటించారు. చివరి సారి 1985లో 'గిరఫ్తార్' సినిమాలో నటించారు. ఈ సినిమాలో వీరితో పాటు అమితాబ్ బచ్చన్ కూడా ఉండడం విశేషం. మధ్యలోని దశాబ్ద కాలంలో ఎన్నో సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించి అభిమానులను అలరించారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి నటిస్తామంటే నిర్మాతలు క్యూ కడతారు. అభిమానులు పోటెత్తుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.