: దారుణం... తమ అరాచకాన్ని లైవ్ స్ట్రీమ్ చేసిన దుర్మార్గులు!
ఇది సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవలసిన సంఘటన. స్వీడన్ రాజధాని స్టాక్ హోంలో జరిగిన ఈ అరాచకం వివరాల్లోకి వెళ్తే... స్టాక్ హోంలో 18, 20, 24 ఏళ్ల వయసున్న ముగ్గురు యువకులు 30 ఏళ్ల మహిళపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ దారుణానికి పాల్పడడం ఒక ఎత్తైతే, దానిని ఫేస్ బుక్ లో లైవ్ స్ట్రీమ్ చేయడం మరో ఎత్తు. ఇక ఈ సందర్భంగా తీసిన ఫోటోలను స్నాప్ ఛాట్ లో పెట్టారు.
ఫేస్ బుక్ లోని 60,000 మంది సభ్యులున్న క్లోజ్డ్ గ్రూప్ లో ఈ వీడియో లైవ్ లో వచ్చింది. దీనిని చూసిన ఓ యువతి ఆ దుర్మార్గులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు, ఆ ముగ్గుర్ని అరెస్టు చేశారు. ఆ క్లోజ్డ్ గ్రూప్, స్నాప్ ఛాట్ సభ్యులను ఆ వీడియో స్ట్రీమింగ్, ఫోటోలు డిలీట్ చేయాలని సూచించారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గ్యాంగ్ రేప్ కు పాల్పడినవారు కిరాతకులైతే, ఆ దృశ్యాలను మౌనంగా వీక్షించిన వారు కూడా అంతేనని నెటిజన్లు మండిపడుతున్నారు.